అమెరికాలోనూ ‘రంగస్థలం’ కొత్త రికార్డు

Update: 2018-05-02 09:58 GMT

భారత్ లోనే కాదు...అమెరికాలోనూ రంగస్థలం కొత్త రికార్డులు నమోదు చేసింది. రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఇప్పటికే 200 కోట్ల రూపాయల గ్రాస్ తో సంచలనం నమోదు చేసింది. ఇప్పటికే అమెరికాలో చాలా ప్రాంతాల్లో నడుస్తున్న రంగస్థలం 3.5 మిలియన్‌ డాలర్ల (23 కోట్ల)కు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. నాన్‌ బాహుబలి రికార్డ్‌ లను అధిగమిస్తూ దూసుకుపోతున్న రంగస్థలం ముందు ముందు మరిన్ని సంచలనాలు నమోదు చేయటం ఖాయం అంటున్నారు ఫ‍్యాన్స్‌.

 

Similar News