అల్లు అర్జున్ ‘ఫస్ట్ డే నే’ అదరగొట్టాడు

Update: 2018-05-05 11:04 GMT

సమ్మర్ సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాయి. కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు ఈ విషయాన్ని రుజువు చేయగా...ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ సినిమా కూడా అదే ట్రెండ్ సృష్టించేలా కన్పిస్తోంది. దీనికి కారణం తొలి రోజునే అల్లు అర్జున్ సినిమా 40 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేయటం. ఈ సినిమాలో అల్లు అర్జున్ గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ గా ఉండటం, ఫైట్లు..డైలాగులు..పాటలు కొన్ని బాగుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు.

దీంతో నా పేరు సూర్య కూడా సమ్మర్ లో వసూళ్ళ పరంగా రికార్డులు సృష్టించటం ఖాయంగా కన్పిస్తోంది. వక్కంతం వంశీ తొలిసారి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అయిన ఈ సినిమా బన్నీ కెరీర్‌లోనే బిగెస్ట్‌ ఓపెనింగ్స్‌ సాధించింది. ఈ సినిమాలో బన్నీ సరసన అను ఇమ్మాన్యూల్‌ హీరోయిన్‌గా నటించింది. ఇందులో శరత్‌ కుమార్‌, అర్జున్‌, బొమన్‌ ఇరానీ, రావూ రమేష్‌, నదియాలు ఇతర కీలకపాత్రలు పోషించారు.

 

Similar News