ఇదేదో కొత్త సినిమా టైటిల్ అనుకునేరు. ఏ మాత్రం కాదు. మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పేరే విజయ్ అంటోని. ఆ పాత్రలో నటిస్తున్నారు ఈ యువ హీరో. కీర్తిసురేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘మహానటి’ సినిమాలో విజయ్ కూడా ఓ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంతతోపాటు విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, షాలిని పాండే, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ లు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మధ్యే సమంత మధురవాణి పాత్ర లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ సినిమాను వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ తన న్యూ లుక్ చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సినిమాలో చేయటం తనకు గర్వంగా ఉందని అన్నారు. సావిత్రి జీవిత చరిత్ర సినిమా కావటంతో పాత కాలం నాటి చొక్కాతో ...ఓ పాత కెమెరా మెడలో వేసుకుని స్కూటర్ లో వెళుతున్న విజయ్ చిత్రం వెరైటీగా ఉంది.