ప్యాకేజీల పోరాటాలు ఎవరివో అందరికీ తెలుసు

Update: 2018-04-20 15:19 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలపై శ్రీ రెడ్డి స్పందించారు. ప్యాకేజీల పోరాటాలు ఎవరివో అందరికీ తెలుసన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నట్లుగా తన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని శ్రీరెడ్డి తెలిపారు. రాజకీయ డ్రామాలు తనకు చేతకాదని ఆమె పేర్కొన్నారు. పోరాటాలు చేస్తున్నట్టు నటించడం తనకు రాదని తెలిపారు. ‘మీ అమ్మ మీకెంతో మా అమ్మ మాకంతే. మా మీద, మా తల్లులను అన్నప్పుడు రోడ్డు మీదకు రేప్‌లు చేస్తున్నప్పుడు, యాసిడ్‌ పోస్తున్నప్పుడు బెదిరింపులతో భయపెడుతున్నపుడు మా బాధ అర్థం కాలేదా?’ అని ప్రశ్నించారు. తన ప్రాణం పోయినా లెక్కచేయబోనని, వీర మరణానికి సిద్ధమని ప్రకటించారు.

‘మీ ఆధిపత్యం సినిమాల్లో చూపించండి. ‘ మా’ ఫిలిం ఛాంబర్‌ మీద చూపించకండి. జర్నలిస్టుల మీద బురద చల్లితే మీ మీదే మరకలు పడతాయి. జర్నలిస్టుల జోలికి వస్తే బాగుండదని హెచ్చరించారు. తన పోరాటం చివరి వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘నిజాలు త్వరలో బయటకు వస్తాయి. ఒకరోజు హడావుడి చేసి భయపడి తోక ముడిచే పోరాటం కాదు నాది. పదేళ్ల క్రితం ఒంటరిగా వచ్చా. చాలా అనుభవించా, ఎవరినీ వదలన’ని అన్నారు. దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు, వార్తా చానళ్లకు ఆమె క్షమాపణ చెప్పారు. తనను చంద్రబాబు, నారా లోకేష్ మరి కొంత మంది నడిపిస్తున్నారనటంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.

 

 

Similar News