ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్ ఎయిర్ పోర్టు

Update: 2018-03-22 10:09 GMT

సింగపూర్. ప్రపంచంలోని పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే దేశాల్లో ఒకటి. అందులో ఆ దేశంలోనే విమానాశ్రయం కూడా ఇప్పుడు ఓ ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. విమానాశ్రయంలోని పలు సౌకర్యాలు..ఏర్పాట్లను పరిశీలించటానికే సగం రోజు పడుతుందంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేందుకు ఈ విమానాశ్రయంలో ఎప్పటికప్పుడు వినూత్న మార్పులు చేస్తున్నారు. అందుకే ఇది వరల్ బెస్ట్ గా నిలిచింది. సింగపూర్ లోని చాంఘీ విమానాశ్రయం మరోసారి ‘ప్రపంచ రికార్డు’ను దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా వరసగా ఆరవ సారి ఈ ఘనత సాధించింది.

స్కై ట్రాక్స్ అనే కన్సల్టెన్సీ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ రేటింగ్ దక్కింది. దక్షిణ కొరియాకు చెందిన ఇంచెన్ విమానాశ్రయం, జపాన్ కు చెందిన హనెడా విమానాశ్రయం వరసగా రెండు, మూడవ స్థానాలు దక్కించుకున్నాయి.. భారత్ కు చెందిన మూడు విమానాశ్రయాలు టాప్ వంద విమానాశ్రయాల్లో చోటు దక్కించుకున్నాయి. ముంబయ్ కు చెందిన విమానాశ్రయానికి 63 ర్యాంకు రాగా, బెంగుళూరు విమానాశ్రయానికి 64వ ర్యాంకు, ఢిల్లీ విమానాశ్రయానికి 66వ ర్యాంకు వచ్చింది.

Similar News