ప్రియా ప్రకాష్ వారియర్. ఒక్క కన్నుగీటుతో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కన్నుగీటడం...కనుబొమలతో ఆ అమ్మాయి ప్రదర్శించిన హావభావాలు యూత్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సన్నివేశాలతో దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఆమె టాప్ సెలబ్రిటీగా మారింది. దీనిపై వివాదాలు కూడా అదే స్థాయిలో చుట్టుముట్టాయి. ఏకంగా కోర్టు కేసుల వరకూ వెళ్లింది వ్యవహారం. అయితే ఓ కాలేజీకి ఇఫ్పుడు ప్రియా ప్రకాష్ వారియర్ పెద్ద సమస్యగా మారారు. అది ఎలా అంటారా? . కోయంబత్తూర్ లో విఎల్ బి జానకమ్మాల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఉంది.
అందులో అమ్మాయిలు చాలా మంది అచ్చం ప్రియా ప్రకాష్ వారియర్ లా కన్నుగీటడం మొదలుపెట్టారట. అదీ క్లాస్ రూమ్స్ లో. చాలా మంది ఫ్యాకల్టీలు ఈ అంశంపై ఫిర్యాదు కూడా చేశారట. దీంతో కాలేజీ యాజమాన్యం ఏకంగా క్లాస్ రూమ్స్ లో సీసీటీవీలు ఏర్పాటు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ లో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు తేలితే వారిని కాలేజీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తామని యాజమాన్యం నోటీసు బోర్డు పెట్టింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.