థియేటర్లలో మళ్లీ సినిమాల సందడి

Update: 2018-03-07 15:15 GMT

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సమ్మె ముగిసింది. గురువారం నుంచి రెండు రాష్ట్రాల్లోనూ థియేటర్లలో సినిమాల ప్రదర్శన ప్రారంభం కానుంది. కొద్ది రోజుల క్రితం డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు వసూలు చేసే రేట్లపై సమస్య తలెత్తి..థియేటర్ల బంద్ కు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం నాడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ , డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ మధ్య రాజీ కుదిరింది. దీంతో సినిమా హాళ్లలో తిరిగి సందడి ప్రారంభం కానుంది.

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు రేట్లు తగ్గించేందుకు అంగీకరించారు. తొలి వారంలో ఒక రేటు..తర్వాత వారాల్లో రేట్లను క్రమంగా తగ్గిస్తూ ఓ అంగీకారానికి వచ్చారు. ఈ బంద్ ద్వారా సినీ పరిశ్రమ ఐకమత్యాన్ని మరోసారి చాటామని నిర్మాత సురేష్ బాబు వ్యాఖ్యానించారు. అయితే తాము ఎప్పుడూ కొత్త టెక్నాలజీ ప్రోత్సహించే విషయంలో ముందుంటామని వెల్లడించారు.

 

Similar News