‘పవన్ కళ్యాణ్’పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Update: 2018-03-17 10:32 GMT

తెలుగుదేశం ఎమ్మెల్యే, టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తాజాగా నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై స్పందించాల్సిందిగా మీడియా బాలకృష్ణను కోరగా..తొలుత ఆయన అందుకు నిరాకరించారు. తర్వాత ముక్తసరిగా స్పందిస్తూ పవన్‌ కల్యాణ్‌పై నేనేదో మాట్లాడి అతణ్ని హీరోని చెయ్యడం మాకు ఇష్టంలేదు. ఇప్పటికీ, ఎప్పటికీ మేమే సూపర్ స్టార్లం’’ అని వ్యాఖ్యానించారు.

బాలకృష్ణ శనివారం అనంతపురం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ‘‘తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి ఒక్కటే అజెండా. ఎవరెవరో ఏవేవో విమర్శలు చేస్తుంటారు. వాటిని మేం పట్టించుకోమన్నారు. ఓ ప్రైవేట్‌ మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఎంజీఎం క్రీడా మైదానంలోని ఎన్‌టీఆర్‌ ఇండోర్‌ స్టేడియం మరమ్మత్తుకు రెండు కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

Similar News