ఆ కారు ఖరీదు 12 కోట్లు

Update: 2018-02-23 04:28 GMT

మామూలుగా మనం కోటి రూపాయల కారు అంటేనే బాబోయ్ అంటాం. కానీ ఈ కారు ధర ఏకంగా 12 కోట్ల రూపాయలు మరి. ఇక దీన్నేమి అనాలి. అవాక్కు అవటం మినహా చేసేదేమీ లేదు. మహా చేస్తే చూసి అనందించగలం. అంతే మరి. విలాసవంత ప్రయాణానికి పేరు రోల్స్ రాయిస్ కార్లు. అలాంటి రోల్స్ రాయిస్ విలాసాన్ని మరో పది పది అడుగులు ముందుకు తీసుకెళ్ళి 8వ జనరేషన్ ఫాంటమ్ కారును భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.9.5 కోట్లు. ప్రొడక్టు పోర్ట్‌ ఫోలియో విస్తరణ భాగంలో కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది. దక్షిణ భారతదేశంలో వ్యాపారం బాగా వృద్ధి చెందుతోంది’ అని రోల్స్‌ రాయిస్‌ మోటార్‌ కార్స్‌ (ఆసియా–పసిఫిక్‌) రీజినల్‌ డైరెక్టర్‌ పాల్‌ హారిస్‌ తెలిపారు.

హైదరాబాద్ లో జరిగిన కారు ఆవిష్కరణ కార్యక్రమంలోచ ఆయన మాట్లాడారు. కేయూఎన్‌ ఎక్స్‌క్లూజివ్‌ చెన్నై, హైదరాబాద్‌లో కంపెనీకి అధికారిక డీలర్‌గా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కాగా రోల్స్‌ రాయిస్‌కి దక్షిణ భారతదేశంలో ఐదు ఔట్‌లెట్స్‌ ఉన్నాయి. ఫాంటమ్‌–8లో 6.75 లీటర్‌ ట్విన్‌ టర్బోచార్జ్‌ డ్‌ వీ–12 ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.4 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. ఇక ఫాంటమ్‌ స్టాండర్డ్‌ వీల్‌బేస్‌ వేరియంట్‌ ధర రూ.9.5 కోట్లుగా, ఫాంటమ్‌ ఎక్స్‌ టెండెడ్‌ వీల్‌బేస్‌ వేరియంట్‌ ధర రూ.11.35 కోట్లుగా ఉంటుందని తెలిపింది.

 

 

Similar News