ప్రస్తుతం యూత్ అంతా ‘ప్రియా ప్రకాష్’ జపం చేస్తోంది. దీని వెనక బలమైన కారణం ఉంది. కంటిచూపుతోనే ఆమె అలా ఊపేస్తోంది. అసలు ఎవరీ ప్రియా ప్రకాష్. ఎందుకు ఆమె ఇంత పాపులర్ అయింది?.. ఒక్క రోజులోనే ఆమె నటించిన వీడియోను 40 లక్షల మంది వీక్షించాల్సినంత సత్తా అందులో ఏముంది?. అంటారా?. అక్కడే ఉంది అసలు విషయం. ఇది అసలు వాలంటైన్స్ డే సీజన్. అబ్బాయిలు అమ్మాయిలకు...అమ్మాయిలు అబ్బాయిలకు వాలంటైన్స్ డే రోజు తమ ప్రేమ వ్యక్తం చేయటానికి ప్రయత్నిస్తారు. అయితే అందులో ఒక్క మాట లేకుండా..కేవలం కంటి చూపుతోనే ఇది వ్యక్తం చేస్తే..ఎలా ఉంటుంది. సరిగ్గా అదే చేసింది ప్రియా ప్రకాష్. అందుకే ఈ వీడియో ఇప్పుడు అంత పాపులర్ అయిపోయింది. ఓ హైస్కూల్ అబ్బాయి-అమ్మాయి కళ్లతోనే ఐ లవ్ యూ చెప్పే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది.
ఇక ఈ అమ్మాయి చూపించే కనుసైగలకు అబ్బాయిల మనసులు ఫుల్‌గా ఫిదా అయిపోతున్నాయి. ఈ వీడియో మళయాలంలోని 'ఓరు అదార్ లవ్' పేరుతో తెరకెక్కుతున్న సినిమాలోనిది. ఈ సినిమా మార్చి 3న విడుదల కాబోతుంది. ఈ మూవీకి సంబంధించి ఓ సాంగ్ చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. మాటలు లేకుండా కేవలం హీరో హీరోయిన్ కనురెప్పలను ఎగరేయడం, కన్ను కొట్టుకోవడం వంటి హావభావాలతోనే లవ్ ప్రపోజ్ చేసుకుంటారు. క్లాస్ రూంలో జరిగే ఈ లవ్ ట్రాక్‌ని అద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు. ఇది యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ దెబ్బకు ఒక్క రోజులోనే ఈ అమ్మాయి సోషల్ మీడియా స్టార్ అయిపోయింది కూడా. ఈ వీడియో విడుదలైన ఎనిమిది గంటల్లోనే ప్రియా ప్రకాశ్ ఇన్‌స్ట్రాగ్రామ్‌కు 4 లక్షల మంది ఫాలోవర్స్ యాడ్ అయ్యారు. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో అతి కొద్ది సమయంలో.. ఎక్కువ షేర్లు అయిన క్లిప్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ వీడియోకి 40 లక్షల వ్యూస్ కూడా వచ్చాయి.
https://www.youtube.com/watch?v=PN9nVcK7N_c