‘టచ్ చేసి చూడు’ సెన్సార్ పూర్తి

Update: 2018-01-25 04:15 GMT

రవితేజ కొత్త సినిమా సందడికి రెడీ అయిపోయింది. టచ్ చేసి చూడు సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. రవితేజ, రాశీఖన్నా జంటగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజా ది గ్రేట్ హిట్ కావటంతో రవితేజ అభిమానులు ఈ కొత్త సినిమాపై కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు.

బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), వల్లభనేని వంశీలు ఈ చిత్రాన్ని నిర్మించారు. రవితేజ ఇమేజ్‌కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారని నిర్మాతలు తెలిపారు. ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసిన పాటలకు, టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చిందన్నారు.

 

Similar News