రేప్ చేసి...వీడియో నెట్ లో

Update: 2018-01-04 07:13 GMT

తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని కొంత మంది రేప్ చేసి ఏకంగా ఆ వీడియో నెట్ లో పెట్టేశారు. ఇది చూసిన కొంత మంది ఆ యువతిని బెదిరించటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జరిగింది. సుల్తానాబాద్ లో ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా రేప్ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించారు. యువతి ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

యువతికి వైద్య పరీక్షల కోసం పెద్దపల్లి ఆసుపత్రికి తరలించి, లైంగిక దాడికి పాల్పడిన కదంపూర్ కు చెందిన బండి శ్రీనివాస్, పెద్ది నగేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కాల్ డేటా సేకరిస్తున్నారు. లైంగిక దాడి వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది ఎవరు, బ్లాక్ మెయిల్ కు పాల్పడింది ఎవరనే కోణంలో విచారణ జరుపుతన్నారు. కట్టెల కోసం గుట్టకు వెళితే ఇద్దరు యువకులు కూల్ డ్రింక్ తాగించారని, అనంతరం సోయిలేకుండా పడిపోయానని బాధిత యువతి పేర్కొన్నారు. అనంతరం తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని మేలుకొని చూసేసరికి, వీడియో తీస్తుంటే అడ్డుకున్నానని తెలిపారు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధిత యువతి కోరుతోంది.

 

Similar News