ఇంత కాలం ఎప్పుడెప్పుడా అంటూ ఊరిస్తూ వచ్చిన మహేష్ బాబు బయటికొచ్చాడు. అదేనండి..ఈ సూపర్ స్టార్ నటిస్తున్న‘భరత్ అను నేను’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ జనవరి 26న విడుదల అయింది. దీంతో పాటు ఓ ఆడియోను కూడా విడుదల చేశారు. అందులో ఏపీ ముఖ్యమంత్రిగా మహేష్ బాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న వాయిస్ ఉంటుంది. ఫస్ట్ లుక్ లో మహేష్ బాబు స్టైలిష్‌గా..సీరియస్ గా చూస్తూ ముందుకు సాగుతుంటాడు. అది తన ఛాంబర్ లో నుంచి బయటికి వస్తున్నదే.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కైరా అద్వానీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న భరత్ అను నేను... ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ లుక్ వచ్చేయటంతో ఇక వరస పెట్టి టీజర్లు..ట్రైలర్లు విడుదల చేసే అవకాశం ఉందని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. భరత్ అను నేను సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పై పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=K43QnikUWPU