టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ

Update: 2017-12-15 11:14 GMT

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు కేంద్ర హోం శాఖ లో ఎదురుదెబ్బ తగిలింది. జర్మనీ పౌరసత్వం కలిగి ఉండి... తెలంగాణలో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన పై కోర్టులో కేసు నమోదు అయింది. కోర్టు రమేష్ పౌరసత్వాన్ని నిర్థారించాల్సిందిగా హోం శాఖను ఆదేశించింది. గతంలోనే హోం శాఖ రమేష్ జర్మనీ పౌరుడే అని తేల్చిచెప్పింది. అయితే దీనిపై ఆయన కోర్టులో పిటీషన్ వేసి తాత్కాలిక ఊరట పొందారు. అయితే రమేష్ హోం శాఖకు మరిన్ని వివరాలు అందజేసి రివ్యూ పిటీషన్ పెట్టుకున్నారు.

ఈ పిటీషన్ ను కూడా హోం శాఖ తోసిపుచ్చింది. దీంతో రమేష్ ఎమ్మెల్యే సభ్యత్వం కోల్పోయే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధిగా ఉండి బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇలా వాస్తవాలను మరుగునపర్చి వ్యవహరించటం సరికాదని హోం శాఖ తన డిస్మిస్ పిటీషన్ లో వ్యాఖ్యానించింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే కేంద్ర సర్కారు చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వాన్ని రద్దు చేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

 

Similar News