భారీ వేతన ప్యాకేజీ కి టెస్లా బోర్డు ఓకే

Update: 2025-11-07 05:53 GMT

ఎలాన్ మస్క్ మరో చరిత్ర సృష్టించాడు. ఆయన ఇప్పటికే ప్రపంచ నంబర్ వన్ సంపన్నుడు . ఇప్పుడు మరో ప్రపంచ నంబర్ వన్ రికార్డు ను అందుకున్నారు. బహుశా ఈ రికార్డు ను బ్రేక్ చేయటం భవిష్యత్ లో కూడా ఎవరికీ సాధ్యం కాదేమో. ఎందుకంటే ఆ రికార్డు అలాంటిది మరి. టెస్లా సీఈఓ గా ఉన్న ఎలాన్ మస్క్ కు కంపెనీ బోర్డు ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. అంటే మన భారతీయ కరెన్సీ లో చూస్తే ఇది ఏకంగా 88 లక్షల కోట్ల రూపాయలు. సహజంగా కంపెనీలు ట్రిలియన్ డాలర్స్ మార్క్ చేరుకున్నవి ఉంటాయి. కానీ ఒక వ్యక్తి ఏకంగా వన్ ట్రిలియన్ డాలర్ మార్క్ చేరుకునే అవకాశం ఒక్క ఎలాన్ మస్క్ కు మాత్రమే సాధ్యం అయింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఈ వేతన ప్యాకేజీ ఒక సంవత్సరంలో కాకుండా రాబోయే పది సంవత్సరాల్లో ఈ చెల్లింపులు చేస్తారు.

                                   అయితే ఇందుకు ఎలాన్ మస్క్ పలు లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. టెస్లా బోర్డు డైరెక్టర్లు ఈ భారీ వేతన ప్యాకేజీకి అంగీకరించిన తర్వాత ఎలాన్ మస్క్ ఫుల్ ఖుషీగా ఒక రోబో తో కలిసి డాన్స్ చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఓటు వేసిన బోర్డు సభ్యులకు మస్క్ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో టెస్లా కొత్త కొత్త రికార్డు లు సృష్టించబోతోంది అని ఎలాన్ మస్క్ ధీమా వ్యక్తం చేశారు. 473 బిలియన్ డాలర్ల సంపద తో ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ సంపన్నుడుగా ఉన్నారు. భారీ ప్యాకేజీ అందుకోవటానికి ఎలాన్ మస్క్ మొత్తం పన్నెండు లక్షాలను అందుకోవాల్సి ఉంటుంది. అందులో టెస్లా మార్కెట్ క్యాప్ ను 8 .5 ట్రిలియన్ డాలర్లకు పెంచటంతో పాటు టెస్లా కార్ల అమ్మకాలను రెండు కోట్ల కు పెంచటం వంటి షరతులు ఇందులో ఉన్నాయి. 

Tags:    

Similar News