ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్

Update: 2023-09-25 07:13 GMT

Full Viewభారత్ వెలుపల అతి పెద్ద హిందూ దేవాలయం అమెరికాలో రానుంది. అక్టోబర్ 8 న న్యూ జెర్సీ లో ఇది ప్రారంభం కానుంది. ఈ స్వామినారాయణ ఆక్షరధామం 162 ఎకరాల్లో నిర్మించారు. పన్నెండు వేల మంది వాలంటీర్లు ఈ దేవాలయం నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. ఈ దేవాలయం నిర్మాణానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది. కాంబోడియా లోని ఆంగ్కోర్ వాట్ దేవాలయం 400 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. దీంతో భారత్ వెలుపల ఉన్న రెండవ అతి పెద్ద హిందూ దేవాలయంగా న్యూ జెర్సీ దేవాలయం నిలవనుంది. ఈ టెంపుల్ న్యూ యార్క్ లోని టైమ్స్ స్క్వేర్ కు దక్షిణాన 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2011 లో ఈ దేవాలయం పనులు ప్రారంభించగా...2023 లో ఇవి పూర్తి అయ్యాయి. ఇంకా ప్రారంభం కాకముందే ఇప్పటికే ప్రతి రోజు వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తున్నారు.

                                                         పురాతన హిందూ సంప్రదాయాల ప్రకారమే దీన్ని నిర్మించారు. భారత్ కు చెందిన పలు నృత్య భంగిమల విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ వినూత్నమైన హిందూ దేవాలయంలో ఒక ప్రధాన మందిరం, పన్నెండు ఉప మందిరాలు ఉంటాయి. అంతే కాదు తొమ్మిది పిరమిడ్ తరహా శిఖరాలు ఉంటాయి. ఈ దేవాలయం నిర్మాణానికి ఇరవై లక్షల క్యూబిక్ అడుగుల రాళ్లను ఉపయోగించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అంటే ముఖ్యంగా బల్గేరియా, టర్కీ, ఇటలీ, గ్రీస్ ల నుంచి వివిధ రకాల రాళ్లను తెప్పించారు. ఇండియా, చైనా ల నుంచి గ్రానైట్, డెకరేటివ్ స్టోన్స్ యూరప్, లాటిన్ అమెరికాల నుంచి తెప్పించారు. 

Tags:    

Similar News