ప్ర‌పంచంలో ప‌వ‌ర్ ఫుల్ పాస్ పోర్టులు ఇవే

Update: 2022-01-12 13:24 GMT

అత్యంత శ‌క్తివంత‌మైన పాస్ పోర్టులుగా జ‌పాన్..సింగ‌పూర్

మెరుగుప‌డిన భార‌త్ పాస్ పోర్ట్ ర్యాంక్

ఎన్ని ఎక్కువ దేశాల‌కు వీసా అవ‌స‌రం లేకుండా వెళ్ళ‌గ‌లిగితే ఆ దేశ పాస్ పోర్టు అత్యంత శ‌క్తివంతమైన‌దిగా ప‌రిగ‌ణిస్తారు. ప్ర‌తి ఏటా ప్ర‌పంచంలోని అత్యంత శ‌క్తివంత‌మైన పాస్ పోర్టుల జాబితాను విడుద‌ల చేస్తుంది హెన్లీ అండ్ పార్ట‌న‌ర్స్ సంస్థ‌. 2022 సంవ‌త్స‌రానికి సంబంధించి తాజాగా ఈ జాబితా విడుద‌ల అయింది. దీని ప్ర‌కారం జ‌పాన్, సింగ‌పూర్ లు మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకున్నాయి. ఈ పాస్ పోర్టుల‌తో ఏకంగా వీసా లేకుండా 192 దేశాల‌కు వెళ్లొచ్చు. అందుకే అవి అగ్ర‌స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో ఆప్ఘ‌నిస్తాన్ చిట్ట‌చివ‌రి స్థానం ద‌క్కించుకుంది. గ‌త ఏడాదితో పోలిస్తే భార‌త్ ఏడు స్థానాలు మెరుగుప‌ర్చుకుని 83వ స్థానం ద‌క్కించుంది. భార‌త పాస్ పోర్టుతో వీసా లేకుండా 60 దేశాల‌కు వెళ్లొచ్చ‌ని ఈ నివేదిక వెల్ల‌డించింది.

ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు అసోసియేష‌న్ (ఐఏటీఏ) అందించిన డేటా ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. జ‌పాన్, సింగ‌పూర్ లు ఈ జాబితాలో మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకోగా...దక్షిణ కొరియా, జ‌ర్మ‌నీ (190 దేశాలు) రెండ‌వ స్థానంలో, ఫిన్లాండ్, ఇట‌లీ, ల‌గ్జెంబ‌ర్గ్, స్పెయిన్ లు (189 దేశాల‌తో) మూడ‌వ స్థానంలో నిలిచాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్, నెద‌ర్లాండ్స్, స్వీడ‌న్ లు (188) దేశాల‌తో నాల‌గ‌వ స్థానంలో, ఐర్లాండ్, పోర్చుగ‌ల్ లు (187 దేశాలు) ఐద‌వ స్థానంలో నిలిచాయి. అమెరికాతోపాటు యునైటెడ్ కింగ్ డ‌మ్, స్విట్జ‌ర్లాండ్, బెల్జియం, న్యూజిలాండ్, నార్వేలు (186 దేశాలు)తో ఆర‌వ స్థానంలో నిలిచాయి. అత్యంత చెత్త పాస్ పోర్టుల జాబితాలో ఉత్త‌ర కొరియా, నేపాల్, పాల‌స్తీనా, సోమాలియా, యెమెన్, పాకిస్థాన్, సిరియా, ఇరాక్, ఆప్ఘ‌నిస్తాన్ లు నిలిచాయి.

Tags:    

Similar News