సెల్ఫ్ క్వారంటైన్ లోకి డబ్ల్యూహెచ్ వో డైరక్టర్ జనరల్

Update: 2020-11-02 05:36 GMT

ఆయన ప్రచంచం మొత్తాన్ని కరోనాపై నిత్యం అప్రమత్తం చేస్తుంటారు. ఎప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తుంటారు. అయితే ఆయన్ను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయనే డబ్ల్యూహెచ్ వో డైరక్టర్ జనరల్ ట్రెడోస్ అథనామ్. కరోనా సోకిన వ్యక్తికి కాంటాక్ట్ లోకి వెళ్లినందుకు ఆయన ఇప్పుడు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని ట్రెడోస్ అథనామ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ముందు జాగ్రత్త చర్యగా డబ్ల్యూహెచ్ వో ప్రొటోకాల్స్ ప్రకారం వ్యవహరిస్తున్నట్లు .తెలిపారు. ఇంటి నుంచే విధులు నిర్వర్తించనున్నట్లు పేర్కొన్నారు. భారత్ లో గత 24 గంటల్లో 46964 కొత్త కోవిడ్-19 ఇన్ఫెక్షన్లతో భారతదేశంలో మొత్తం కేసులు 81,84083 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,22,111 కు పెరిగిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News