ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ

Update: 2021-04-15 11:36 GMT

దేశాన్ని రెండవ దశ కరోనా వేవ్ వణికిస్తోంది. దీంతో పలు రాష్ట్రాలు బలవంతంగా అయినా కర్ఫ్యూ వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. పెరుగుతున్న కేసులను అడ్డుకోవాలంటే కర్ఫ్యూ వంటివే ఉత్తమ మార్గం అని నమ్ముతున్నారు. అందుకే ఢిల్లీ సర్కారు కూడా వారాంతపు కర్ఫ్యూకు మొగ్గుచూపింది. ఈ మేరకు నిర్ణయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఎల్జీ, ఉన్నతాధికారులు, మంత్రులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం 5 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, బెడ్స్ కొరత లేదని తెలిపారు. ఈ విషయంలో మీడియా కూడా సంయమనం పాటించాలని, ప్రజలను ఆందోళనకు గురిచేయొద్దన్నారు. సినిమా హాల్స్ లో సీటింగ్‌ను 30శాతానికి కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాల్స్, జిమ్స్, ఆడిటోరియం, స్పాలు మూసివేయాలని ఆదేశించారు. విమానయాన, రైల్వే ప్రయాణికులు కచ్చితంగా టికెట్స్ చూపించాలన్నారు. వివాహాలు చేసుకునే వారికి కర్ఫ్యూ పాస్‌లు జారీ చేస్తామన్నారు.

Tags:    

Similar News