మెరుగుపడిన ఇండియా పాస్ పోర్ట్ ర్యాంక్

Update: 2023-07-19 12:04 GMT

Full Viewఇండియా పాస్ పోర్ట్ తో వీసా లేకుండా 57 దేశాలు తిరిగి రావొచ్చు. అయితే ఆయా దేశాలకు వెళ్లాలంటే అక్కడ వీసా ఆన్ అరైవల్ లేదా ఎలక్ట్రానిక్ వీసా వంటి మార్గాల ద్వారా అత్యంత సులభంగా వీసా లు పొందవచ్చు. ఏ దేశానికి అయితే వెళుతున్నామో అక్కడ ఆ ప్రయాణికుడు ఉండే హోటల్ లేదా ఇతర నివాస వివరాలు..రిటర్న్ టికెట్ వంటి వివరాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటాయి. తాజాగా హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో భారత్ పాస్ పోర్ట్ కు 80 వ స్థానం దక్కింది.

గతంలో 85 వ ప్లేస్ లో ఉన్న భారత్ ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 80 కి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. ఐదేళ్ల పాటు ఈ ప్లేస్ లో కొనసాగిన జపాన్ పాస్ పోర్ట్ మూడవ స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా పాస్ పోర్ట్ ర్యాంక్ ఎనిమిదవ ప్లేస్ లో ఉంది. సింగపూర్ పాస్ పోర్ట్ తో 192 దేశాల్లో ఈజీ గా ప్రయాణించవచ్చు. వీసా లేకుండా భారతీయలు వెళ్లగలిగిన దేశాల జాబితా వివరాలు ఇలా ఉన్నాయి.

అల్బేనియా

బార్బడోస్

భూటాన్

బొలివియా

బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్

బురుండి

కాంబోడియా

కేప్ వెర్డ్ ఐలాండ్స్

కొమొరో ఐలాండ్స్

కుక్ ఐలాండ్స్

డొమినికా

ఎల్ సాల్వడార్

ఫిజి

గేబన్

గ్రెనడా

గునియా -బిస్సావు

హైతీ

ఇండోనేషియా

ఇరాన్

జమైకా

జోర్డాన్

కజకిస్తాన్

లావోస్

మకావు

మడగాస్కేర్

మాల్దీవులు

మార్షల్ ఐలాండ్స్

మౌరిటానియా

మారిషస్

మైక్రోనేషియా

మోంటీసెర్ట్

మొజాంబిక్యూ

మయాన్మార్

నేపాల్

నియూఏ

ఒమాన్

పాలు ఐలాండ్స్

ఖతార్

ర్వాండా

సామోఆ

సెనెగల్

సీషెల్స్

సియర్రా లియోన్

సోమాలియా

శ్రీ లంక

సెయింట్ కిట్స్ మరియు నెవిస్

సెయింట్ లూసియా

సెయింట్ విన్సెంట్

టాంజానియా

థాయిలాండ్

తిమోర్ -లేస్తే

టోగో

ట్రినిడాడ్ అండ్ టొబాగో

ట్యునీషియా

టువాలు

వనౌతు

జింబాబ్వే లు ఉన్నాయి. 

Tags:    

Similar News