వీసా ఫ్రాడ్...10 కోట్లతో జంప్

Update: 2020-12-07 12:21 GMT

కాలేజీలు, యూనివర్శిటీల్లో చదువుకునే విద్యార్ధులకు ఇఛ్చే ఎఫ్1 వీసాలను హెచ్ 1బీ వీసాలుగా మారుస్తామని చెప్పి ఓ జంట ఏకంగా విద్యార్ధుల నుంచి పది కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇందులో ఎంతో మంది విద్యార్ధులు మోసపోయారు. ముత్యాల సునీల్‌, ప్రణీతలు అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థులను హెచ్‌1 వీసా పేరిట మోసం చేశారు. ఒక్కో విద్యార్థి దగ్గరి నుంచి 25 వేల డాలర్లు వసూలు చేశారు. ఈ మోసానికి సంబంధించి 30 మంది తెలుగు విద్యార్థులు నార్త్ కరోలినా హోం ల్యాండ్ సెక్యూరిటీలో ఫిర్యాదు చేశారు.

దీంతో ఇంటర్‌పోల్ ముత్యాల సునీల్, ప్రణీతలపైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం సునీల్, ప్రణీత పరారీలో ఉన్నారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బులను సునీల్ తన తండ్రి ముత్యాల సత్యనారాయణ అకౌంట్‌కు బదిలీ చేశాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరిలో ఉంటున్న సత్యనారాయణ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. ఈ ఘటన వెలుగుచూడటంతో సత్యనారాయణ కూడా పరారీలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం పోలీసులు సత్యనారాయణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News