దిగొచ్చిన ట్విట్ట‌ర్

Update: 2021-07-11 07:18 GMT
దిగొచ్చిన ట్విట్ట‌ర్
  • whatsapp icon

కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటూ వివాదాల‌కు దిగిన ట్విట్ట‌ర్ దిగొచ్చింది. భార‌త్ లో కార్య‌క‌లాపాలు నిర్వ‌హించాలంటే భార‌తీయ చట్టాల‌ను పాటించాల్సిందేన‌ని..లేదంటే తాము కూడా ఏమీ చేయ‌లేమ‌ని కోర్టులు కూడా తేల్చిచెప్ప‌టంతో ట్విట్ట‌ర్ కు మ‌రో మార్గం లేకుండా పోయింది. అందుకే నూతన ఐటి చ‌ట్టాల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు ప్రారంభించింది. భారత్‌లో ట్విట్టర్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌గా వినయ్‌ ప్రకాశ్‌ను నియమించింది. ట్విట్టర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని పేర్కొంది.

సోషల్‌ మీడియాకు సంబంధఙంచి ఇటీవల కేంద్రం కొత్త ఐటీ చట్టాలను అమల్లోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చట్టాల ప్రకారం మూడు కీలక పోస్టులైన చీఫ్‌ కంప్లైయిన్స్‌, గ్రీవెన్స్‌, నోడల్‌ అధికారులను నియమించాలని చెప్పింది. ట్విట్టర్‌ భారతీయులు కానీ వ్యక్తులను ఈ పోస్టులో నియమించి వివాదానికి తెర తీసింది. ఇప్పుడు కేంద్ర సూచనలకు తగ్గట్టుగా గ్రీవెన్స్‌ ఆఫీసర్‌గా భారతీయున్ని నియమించింది.

Tags:    

Similar News