ముంబయ్ పోలీసులు టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, చెన్నయ్ సూపర్ సింగ్స్ సభ్యుడు సురేష్ రైనాను అరెస్ట్ చేశారు. ముంబయ్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న డ్రాగన్‌ఫ్లై క్లబ్‌లో జరిగిన దాడుల్లో రైనాతో పాటు గాయకుడు గురు రాంధవాను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. స్టేషన్ కు తీసుకెళ్ళిన తర్వాత వెంటనే వారిని బెయిల్‌పై విడుదల చేశారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా పబ్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో రైడ్స్ నిర్వహించారు.
ఈ దాడిలో ముంబయ్ క్లబ్‌కు చెందిన ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 34 మందిని అరెస్టు చేశారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు అరెస్టు చేసి కేసు నమోదు చేశామని.. వారిలో గాయకుడు గురు రాంధవా, క్రికెటర్ సురేష్ రైనా కూడా ఉన్నారని సహార్ పోలీస్ స్టేషన్ తెలిపింది. క్రికెటర్ సురేష్ రైనాతో పాటు 34 మందిపై ఐపిసి సెక్షన్ 188, 269, 34, ఎన్‌ఎండిఎ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ముంబయ్ పోలీసులు తెలిపారు.