మరీ ఇంత దారుణమా

Update: 2024-10-01 08:24 GMT

Full Viewషాకింగ్ పరిణామం ఇది. ఐ ఫోన్ కోసం ఇంత దారుణమా. ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన వ్యక్తి ఒకరు లక్షన్నర రూపాయల విలువ చేసే ఐ ఫోన్ కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టాడు. క్యాష్ ఆన్ డెలివరీ (సిఓడీ) మోడ్ ఎంచుకుని ఫ్లిప్ కార్ట్ లో ఐ ఫోన్ కొనుగోలుకు అంతా ఒకే చేశాడు. దాని ప్రకారమే ఫోన్ డెలివరీ వచ్చింది. కానీ ఆ ఆర్డర్ పెట్టిన వ్యక్తి దగ్గర చెల్లించటానికి లక్షన్నర రూపాయలు లేవు. దీంతో ఆ డెలివరీ బాయ్ ని చంపేసి..ఒక గోనె సంచిలో పెట్టి కాలువలో పడేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఈ దారుణానికి ఒడిగట్టిన వాళ్ళ పేర్లు ఆకాష్ కుమార్ , గజానంద్ గా పోలీస్ లు వెల్లడించారు. ముప్పై సంవత్సరాల వయసు ఉన్న డెలివరీ బాయ్ భరత్ కుమార్ కు డబ్బులు ఇవ్వాల్సిన వీళ్ళు యాక్సిడెంట్ లో ఫోన్ పోయింది అని చెప్పాలని..రక రకాలుగా వేధింపులకు గురి చేసి ఐ ఫోన్ ఇవ్వాలని కోరారు.

                                      ఇందుకు అతను అంగీకరించకపోవడంతో హత్య చేయటమే కాకుండా..అతని దగ్గర ఉన్న 35000 రూపాయలను కూడా తీసుకున్నారు. డెలివరీ బాయ్ వాహనాన్ని వేరే ప్రదేశంలో వదిలిపెట్టారు. డెలివరీ బాయ్ రెండు రోజులు అయినా ఇంటికి రాకపోవటంతో ఆయన కుటుంబ సభ్యలు మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసుల విచారంలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిసిటివీ ఫుటేజ్ తో పాటు ఇతర అంశాల ఆధారంగా పోలీసులు ఈ కేసు ను ఛేదించారు. విచారణలో ఆకాష్ తో పాటు గజానంద్ కూడా నేరాన్ని అంగీకరించినట్లు పోలీస్ లు తెలిపారు. ఐ ఫోన్ కోసం డెలివరి బాయ్ ను హత్య చేసిన ఘటనపై విస్మయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News