దేశీయ స్టాక్ మార్కెట్లో బేర్స్ పట్టే కొనసాగుతోంది. వరసగా మూడవ రోజు కూడా మదుపర్లు భారీ నష్టాలను చవిచూశారు. గురువారం నాడు ఓ దశలో వెయ్యి పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్ చివర్లో కాస్త కోలుకుంది. బీఎస్ ఈ సెన్సెక్స్ 634 పాయింట్ల నష్టంతో 59,464.62 పాయింట్ల వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లు ఈ మధ్య కాలంలో భారీ ఎత్తున పెరగటంతో మదుపరుల లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు.
దీంతోపాటు ద్రవ్యోల్భణ భయాలు, ఇంథన దరలు పెరగటం కూడా సెంటిమెంట్ పై ప్రభావం చూపించాయి. ఎఫ్ ఎంసీజీతోపాటు ఫార్మా, ఐటి రంగాలకు చెందిన కంపెనీలు భారీగా నష్టపోయాయి. ఆయా రంగాలకు చెందిన షేర్లు నష్టాలను చవిచూశాయి. మూడు రోజుల్లోనే సెన్సెక్స్ ఏకంగా 1800 పాయింట్ల మేర నష్టపోయింది. దీంతో ఇన్వెస్టర్లు అతి తక్కువ సమయంలో భారీ ఎత్తున సంపదను నష్టపోవాల్సి వచ్చింది.