దేశానికి నాయకత్వం వహించే ధృవతారగా ఎదగాలి
ఇది తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ కు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు పంపిన పుట్టిన రోజు సందేశంలోని చివరి లైన్లు. శనివారం నాడు కెటీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రామోజీరావు ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షల సందేశం పంపారు. అరుదైన నాయకత్వ లక్షణాలు, అసాధారణ సంభాషణా నైపుణ్యం, అన్నింటికి మించిన రాజకీయ చతురతతో అనతి కాలంలోనే పరిణతి గల నాయకుడిగా ఎదిగి తెలంగాణ రాజకీయ యవనికపై వెలుగులీనుతున్న మీకు 45వ పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఆశీస్సులు అని తన లేఖలో పేర్కొన్నారు. ఒక ఉన్నతశ్రేణి నాయకుడికి కావల్సిన లక్షణాలన్నీ మూర్తీభవించిన మీ పనితీరు నేను ఆది నుంచి గమనిస్తూనే ఉన్నాను. మీరు సాధిస్తున్న పురోగతిని చూసి గర్విస్తున్నాను.అని రామోజీరావు తన లేఖలో పేర్కొన్నారు. రామోజీరావు రాసిన లేఖను కూడా ఈ వార్తలో చూడొచ్చు.