రాహుల్ బ‌జాజ్ క‌న్నుమూత‌

Update: 2022-02-12 11:50 GMT

దేశ పారిశ్రామిక దిగ్గ‌జాల్లో ఒక‌రైన రాహుల్ బ‌జాజ్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 83 సంవ‌త్స‌రాలు. గత కొద్ది రోజులుగా న్యుమోనియా, గుండె సమస్యలతో రాహుల్ బజాజ్ బాధ పడుతున్నారు. చికిత్స నిమిత్తం నెల రోజులుగా ఆయ‌న ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో 12 ఫిబ్రవరి, 2022 మధ్యాహ్నం 2. 30 గంటలకు తుదిశ్వాస విడిచారని బజాజ్ గ్రూప్ ఒక ప్రకటనలో వెల్ల‌డించింది.

గతేడాది ఏప్రిల్‌లో బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాహుల్‌ బజాజ్‌ రాజీనామా చేశారు. దేశ‌ కార్పొరేట్ రంగంలె తనదైన ముద్రను వేశారు రాహుల్‌ బజాజ్‌. 40 ఏళ్ల పాటు బజాజ్‌ గ్రూప్‌ చైర్మన్‌గా సేవలను అందించారు. 2001లో భారత మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ రాహుల్‌ బజాజ్‌కు లభించింది. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీగా ఆయన పనిచేశారు. 

Tags:    

Similar News