పవర్ ఫుల్ పాస్ పోర్టుల జాబితా వచ్చేసింది

Update: 2021-01-07 14:13 GMT

పాస్ పోర్టు. ఒక దేశం నుంచి మరో దేశం పోవాలంటే ఖచ్చితంగా అవసరమైన పత్రం. కొన్ని పాస్ పోర్టులు అత్యంత శక్తివంతం అయితే..మరికొన్నింటికి చాలా సమస్యలు వస్తాయి. శక్తివంతమైన పాస్ పోర్టులు ఉన్న వారు ఏ దేశంలోకి అయినా ఈజీగా ప్రవేశించవచ్చు. అదే ర్యాంకింగ్ తక్కువ ఉంటే..వారికి మాత్రం చాలా కష్టాలే. తాజాగా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టుల జాబితా విడుదలైంది. 2021 సంవత్సరానికి గాను ఈ జాబితాను వెలువరించారు. ఏ పాస్ పోర్టుతో వీసా అవసరం లేకుండా, వీసా ఆన్ అరైవల్ తో ఎక్కువ దేశాలు ప్రయాణించే వీలు ఉంటుంటే వాటినే శక్తివంతమైన పాస్ పోర్టులుగా గుర్తిస్తారు. హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ ప్రతి ఏటా ఈ జాబితా విడుదల చేస్తుంది. మరోసారి జపాన్ 191 దేశాల సందర్శన సౌలభ్యంతో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

190 దేశాలతో సింగపూర్ రెండవ స్థానంలో ఉండగా, 189 దేశాలతో దక్షిణ కొరియా, జర్మనీ లు మూడవ స్థానంలో ఉన్నాయి.ఇటలీ, ఫిన్ లాండ్ , స్పెయిన్, లగ్జంబర్గ్ లు నాల్గవ స్థానంలో, డెన్మార్క్, ఆస్ట్రియాలు ఐదవ స్థానంలో, స్వీడన్, ఫ్రాన్స్, పోర్చుగల్, నెదర్లాండ్, ఐర్లాండ్ లు ఆరవ స్థానం, స్విట్జర్లాండ్, యునైటెడ్ స్టేట్స్, యునెటైడ్ కింగ్ డమ్, నార్వే, బెల్జియం, న్యూజిల్యాండ్ లు ఏడవ స్థానంలో, గ్రీస్, మాల్టా, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియాలు ఎనిమిదవ స్థానంలో, కెనడా తొమ్మిదవ స్థానంలో, హంగరీ పదవ స్థానంలో ఉంది. అత్యంత చెత్త పాస్ పోర్టుల జాబితాలో ఉత్తర కొరియా, లిబియా, నేపాల్, పాలస్తీనా, సోమాలియా, యెమెన్, పాకిస్తాన్, సిరియా, ఇరాక్, అప్ఘనిస్తాన్ లు ఉన్నాయి.

Tags:    

Similar News