పోలీస్ లను అడ్డుకున్నారని కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణాబ్ గోస్వామి ముంబయ్ పోలీసులు మరో షాక్ ఇచ్చారు. ఆయనపై బుధవారం సాయంత్రం మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బుధవారం ఉధయం అర్ణాబ్ గోస్వామిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ సమయంలో పోలీసులను అడ్డుకున్నారనే కారణంతో అర్ణాబ్ తోపాటు ఆయన భార్య పై కూడా తాజాగా కేసు పెట్టారు. ఆయనపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సె క్షన్లు 353, 503, 506,34 కింద కేసు నమోదు చేశారు. 2018లో ఇంటీరియర్ డిజైన్ ఆత్మహత్యకు కారణమయ్యారనే కేసులో అర్ణాబ్ ను అరెస్ట్ చేశారు.
అర్ణాబ్ తో పాటు మరో ఇద్దరు 5.40 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా..ఇవ్వకపోవటంతో ఒత్తిడి కారణంగానే అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ లు ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్ లో వీరి పేర్లు ఉండటంతో కేసు నమోదు అయింది. వాస్తవానికి ఈ కేసు ఓ సారి క్లోజ్ చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ కేసును రీ ఓపెన్ చేసి విచారణ ప్రారంభించారు. అందులో భాగంగానే ఇఫ్పుడు అరెస్ట్ జరిగింది. అర్ణాబ్ అరెస్ట్ పై బిజెపి నేతలు, కేంద్ర మంత్రులు మండిపడుతున్నారు.