దుమ్మురేపుతున్న మ‌హీంద్రా ఎక్స్ యూవీ700 బుకింగ్స్

Update: 2021-10-07 14:31 GMT

నిమిషాలు 57...బుకింగ్స్ 25 వేలు

మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (ఎంఅండ్ఎం) కొత్త ఎక్స్ యూవీ 700 దుమ్మురేపుతోంది. ఊహించిన‌ట్లే ఈ వాహ‌నాల‌కు విప‌రీత‌మైన డిమాండ్ వ‌స్తోంది. బుకింగ్స్ ప్రారంభించిన 57 నిమిషాల్లో ఏకంగా 25 వేల బుకింగ్స్ వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని కంపెనీ అధికారికంగా వెల్ల‌డించింది. ఎక్స్ యూవీ 700కి వ‌స్తున్న స్సంద‌న చూసిన త‌ర్వాత త‌మ బాధ్య‌త మ‌రింత పెరిగింద‌ని సంస్థ పేర్కొంది. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో ఇది ఒక సరికొత్త రికార్డు అని కంపెనీ పేర్కొంది. మహీంద్రా ఎక్స్‌యువి700 పరిచయ ఆఫర్ కింద తక్కువ ధరలతో లాంఛ్ చేశారు. మొదటి 25,000 బుకింగ్స్ కు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు ఎంట్రీ వేరియంట్ ఎక్స్‌యువి700 ధరలు ₹12.49 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి. బేస్ వేరియంట్ ధరలను కంపెనీ ₹50,000 వరకు పెంచింది.

బుకింగ్స్ మళ్లీ అక్టోబర్ 8న ఉదయం 10 నుంచి తిరిగి తెరవనున్నారు. కస్టమర్లు డీలర్ షిప్ లేదా డిజిటల్ ఫ్లాట్ ఫారాల ద్వారా ఎక్స్‌యువి 700ని బుక్ చేసుకోవచ్చు, మహీంద్రా గురువారం నాడు మొదటిసారి బుకింగ్స్ ప్రారంభించింది. కంపెనీ 25,000 మంది కారు బుక్ చేసుకున్న తర్వాత ధరలను పెంచింది. అన్ని వేరియెంట్ల ధరలను పెంచలేదు. కొన్ని వేరియెంట్ల ధరలను మాత్రమే పెంచింది. ఇది పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో లభిస్తోంది. డీజిల్ వెర్షన్‌లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్ఠంగా 185 పీఎస్‌ శక్తిని, 450 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్ఠంగా 200 పీఎస్‌ శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఈ పండ‌గ సీజ‌న్లో బుకింగ్స్ మ‌రింత ఆశాజ‌న‌కంగా ఉంటాయ‌ని కంపెనీ అంచ‌నా వేస్తోంది. 

Tags:    

Similar News