జైలులో మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య

Update: 2020-10-14 13:08 GMT

విషాదాంతం. జైలులో ఆత్మహత్య. తెలంగాణలో కోటి రూపాయల అవినీతితో కలకలం రేపిన కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. కోటి పది లక్షల రూపాయల లంచం ఏసీబీకి తీసుకుంటూ పట్టుబడిన ఆయన వ్యవహారం పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అవినీతి నిరోధక శాఖ ఆయనను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నకిలీ పాసు పుస్తకాల జారీ విషయంలో కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజుపై ఏసీబీ మంగళవారం ప్రశ్నల వర్షం కురిపించింది.

రెండోసారి అతడిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు.. కందాడి ధర్మారెడ్డి, అతడి కుటుంబ సభ్యులకు, ఇతరులకు కలిపి దాదాపు 24 ఎకరాల భూమికి అక్రమ పద్ధతిలో పాసు పుస్తకాలు ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన తహసీల్దార్‌ నాగరాజుది ఆది నుంచీ అవినీతి చరిత్రేనని అధికార వర్గాల్లో ప్రచారంలో ఉంది. రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా టైపిస్టు నుంచి ఆర్‌ఐ, డీటీ, తహసీల్దార్‌ వరకు పనిచేసిన ప్రతి స్థాయిలో ఆయన వసూళ్ళు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవినీతితో ఇలా కోట్లు సంపాదించి ఇలా ఆకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News