బైడెన్ వల్ల అమెరికా స్టాక్స్ కు నష్టమే

Update: 2020-11-07 11:59 GMT

ఎవరి గొడవ వారిది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఎవరికి లాభం. ఎవరికి నష్టం. ఈ చర్చ సాగుతూనే ఉంది. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా డెమాక్రటికి అభ్యర్ధి జో బైడెన్ గెలిస్తే అమెరికా స్టాక్స్ కు మాత్రం అది ఏ మాత్రం మంచిది కాదని ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ వ్యాఖ్యానించారు. అయితే ఇది అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు మాత్రం మేలు చేస్తుందని ప్రకటించారు.

వీటితోపాటు ఇతర గ్లోబల్ ఈక్విటీలు లాభపడతాయని అభిప్రాయపడ్డారు. జో బైడెన్ కంపెనీలపై పన్నులు పెంచటంతోపాటు సంపన్న అమెరికన్లపై పన్నులు వేసేందుకు రెడీగా ఉన్నారని మోబియస్ తెలిపారు. పన్నులు పెంచటం వల్ల ప్రజలు అమెరికా స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టడం తగ్గిస్తారని అన్నారు. ఫలితాల ప్రకటన ఆలశ్యం అయినా జో బెడైన్ శ్వేతసౌథానికి చేరటం పక్కా అని స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.

Tags:    

Similar News