నేను ఆగుతా..కానీ కరోనా ఆగదుగా

Update: 2020-11-14 12:45 GMT

అమెరికా నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి రోజు లక్షల సంఖ్యలో అమెరికాలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కరోనా నియంత్రణకు తక్షణమే అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'నేను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. కానీ వచ్చే ఏడాది వరకూ బాధ్యతలు స్వీకరించలేను. కానీ కోవిడ్ 19కి తేదీలు, క్యాలెండర్ తో సంబంధం లేదు. వైరస్ విజృభిస్తోంది. ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించాలి. నిర్లక్ష్యాన్ని విడనాడాలి' అని పేర్కొన్నారు.

మరో వైపు డిసెంబర్ నాటికి అమెరికాలో రెండు కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. దిగ్గజ ఫార్మా సంస్థ ఫైజర్ తమ వ్యాక్సిన్ 90 శాతం సమర్ధతో పనిచేస్తుందని ప్రకటించింది. కానీ కొంత మంది ఈ వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ప్రకటించారు. వ్యాక్సిన్ వేసుకున్న హ్యాంగోవర్ అన్పించిందని ఇది తీసుకున్న వారు వెల్లడించారు. ఇదిలా ఉంటే అత్యవసర అనుమతులతో వ్యాక్సిన్లు తెచ్చేందుకు పలు ఫార్మా సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పరీక్షల డేటా అందిన వెంటనే ఈ పని ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News