స్టాక్ మార్కెట్ లో భారీ ఇష్యూ అంటే చాలు భయపడే పరిస్థితి. ఎందుకంటే గత కొంత కాలంగా మార్కెట్లోకి వచ్చిన భారీ ఇష్యూలు అన్ని కూడా ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చినవే. ఇందుకు ఉదాహరణ ఇటీవలే మార్కెట్ లోకి వచ్చిన ఎన్ఎస్ఈ ఇష్యూ అని చెప్పుకోవచ్చు. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ప్లాట్ ఫార్మ్స్ లిమిటెడ్ ( జెఐఎల్) ఆ ట్రెండ్ ను బ్రేక్ చేసింది. బుధవారం నాడు ఈ కంపెనీ షేర్లు లిస్టింగ్ లోనే ఇన్వెస్టర్లకు మంచి ప్రతిఫలాన్ని అందించాయి. దేశంలోనే అతి పెద్ద ఐపీవో గా రికార్డు నమోదు చేసిన జియో ప్లాట్ ఫార్మ్స్ లిమిటెడ్ షేర్లు బుధవారం నాడు 1358 రూపాయల వద్ద నమోదు అయ్యాయి. జియో ఐపీఓలో కంపెనీ షేర్ల గరిష్ట ధరను 1119 గా నిర్ణయించింది. ఆఫర్ ధర తో పోలిస్తే ఒక్కో షేర్ పై ఇన్వెస్టర్లకు లిస్టింగ్ లోనే 239 రూపాయల మేర లాభం దక్కినట్లు అయింది. ఆఫర్ ధర కంటే ఈ కంపెనీ షేర్లు 21 .36 శాతం ప్రీమియం తో నమోదు అయ్యాయి.