ప్రపంచ 100 అగ్రశ్రేణి సంస్థల్లో భారత్ నుంచి నాలుగే
జాబితాలో ముందు హైదరాబాద్ ఐఎస్ బీనే
ప్రపంచ వ్యాప్తంగా వంద అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్స్ జాబితా తయారు చేస్తే అందులో భారత్ కు చెందిన నాలుగింటికి మాత్రమే చోటు దక్కింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేసేందుకు వంద కాలేజీల జాబితా సిద్ధం చేశారు. 2022 సంవత్సరానికి గాను ఫైనాన్సియల్ టైమ్స్ ఈ జాబితాను సిద్ధం చేసింది. ఇందులో తొలి స్థానం పెన్సిల్వేనియోలోని వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్శిటీ మొదటి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా కొలంబియా బిజినెస్ స్కూల్ రెండవ స్థానంలో ఉంది. ఇక బారత్ విషయానికి వస్తే ఈ జాబితాలో 32వ ర్యాంక్ ద్వారా హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ దేశం నుంచి మొదటి స్థానంలో ఉంది.
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) బెంగుళూరుకు 53 వ ర్యాంకు, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం కలకత్తాలు వరసగా 62, 68 ర్యాంకులు దక్కించుకున్నాయి. వార్టన్, కొలంబియాల తర్వాత హర్వర్డ్, కెల్లాగ్, స్టాన్ ఫోర్డ్, బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్, యాలే స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్, మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి సంస్థలు టాప్ లో ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సుల్లోనూ..పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సుల రూపకల్పనలో ఐఎస్ బి ముందు వరసలో ఉంటుందనే చెప్పొచ్చు. ఐఎస్ బీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాంలు పూర్తి చేస్తే చాలు..దిగ్గజ కార్పొరేట్ సంస్థలు మంచి మంచి ప్యాకేజీలతో ఆఫర్లు ఇస్తున్న విషయం తెలిసిందే.