హ్యుండయ్ షేర్ల లిస్టింగ్ లో మెరుపులు ఉంటాయా?!

Update: 2024-10-21 12:29 GMT

స్టాక్ మార్కెట్ లో హ్యుండయ్ మోటార్ ఇండియా షేర్లు దూసుకెళతాయా?..లేదా బ్రేక్ లు పడతాయా?. ఇప్పడు అందరి దృష్టి దానిపైనే. దేశంలోనే అతి పెద్ద ఐపీఓ తో రికార్డు సృష్టించిన హ్యుండయ్ మోటార్ షేర్లు మంగళవారం నాడు బిఎస్ఈ తో పాటు ఎన్ ఎస్ఈ లో లిస్ట్ కానున్నాయి. నిన్న మొన్నటి వరకు హ్యుండయ్ మోటార్ షేర్ల గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) మైనస్ లో ఉంది. దీంతో ఆఫర్ ధర కంటే తక్కువకే హ్యుండయ్ షేర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి.

                                                  విచిత్రంగా లిస్టింగ్ కు ఒక రోజు ముందు అంటే సోమవారం నాడు హ్యుండయ్ మోటార్ జీఎంపీ 75 రూపాయల వద్ద ఉంది అని చెపుతున్నారు. అంటే ఆఫర్ ధర 1960 రూపాయలతో పోలిస్తే ఈ షేర్లు 2035 రూపాయల వద్ద ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది అనే అంచనాలు వెలువడుతున్నాయి. హ్యుండయ్ మోటార్ ప్రైమరీ మార్కెట్ నుంచి 27870 కోట్ల రూపాయలు సమీకరించిన విషయం తెలిసిందే. మార్కెట్ ప్రస్తుతం తీవ్ర ఒడిడుకులు ఎదుర్కొంటున్న వేళ హ్యుండయ్ లిస్టింగ్ అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ లిస్టింగ్ లో మరీ తేడా వస్తే మాత్రం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అతి పెద్ద ఐపీవో ల వైపు ఇన్వెస్టర్లు అంత ఆసక్తి చూపించే అవకాశం ఉండేది అనే చెప్పొచ్చు.

Tags:    

Similar News