ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయనకు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబందించిన వీడియో ఒకటి వాట్పప్ లో వైరల్ అవుతుంది. అందులో ఆయన పుష్ప సినిమా తీరుపై మండిపడ్డారు. ఎక్కడైనా అసలు ఓ స్మగ్లర్ ను హీరోగా చూపిస్తారా? అని ప్రశ్నించారు. అంటే మీరు తీసే పుష్ప 2 సినిమా కోసమో..పువ్వు 3 కోసమే సమాజం అంతా అప్పటి వరకూ చెడిపోవాలా అని నిలదీశారు. ఓ స్మగ్లింగ్ వాడిని మీరు హీరో చేశారు..ఏమన్నా అంటే చివరిలో ఓ ఐదు నిమిషాలు మంచివాడిగా చూపిస్తామంటారు. నవ్వు..రెండూ, మూడు తీసేవరకూ సమాజం చెడిపోవాలా?. పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలా అంటాడా?.అదో పెద్ద ఉపనిషత్తు సూక్తి అయిపోయింది ఇవాళ.
ఇప్పుడు ఓ కుర్రాడు కూడా ఎవడినైనా గూబమీద కొట్టి తగ్గేదేలా అంటాడు.దీనికి ఎవరు కారణం. నాకు కోపమే వస్తుంది. ఎందుకు రాదు..జరిగింది చెడు అయినప్పుడు కోపమే వస్తుంది, ఆ హీరోని కానీ..ఆ డైరక్టర్ ను కానీ నాకు సమాధానం చెప్పమనండి కడిగేస్తా మొత్తాన్ని అనుమానమే లేదు. ఈ డైలాగ్ వల్ల ఏమైఐంద అంటే సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి. తగ్గేదేలా అంటే ఎవరు అనాలి. హరిశ్చందుడు లాంటి వాడు..శ్రీరామచంద్రుడు లాంటి వాడు అనాలి. ఒక స్మగ్లర్ అనటం ఏమిటి ఆ డైలాగ్ అంటూ మండిపడ్డారు. టాలీవుడ్ లోనని సినిమాల పేర్తు ప్రస్తావిస్తూ..రౌడీ, ఇడియట్..నిన్న కాక మొన్న పుష్ప సినిమా ఒకటి వచ్చింది అంటూ గరికపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 17న విడుదలైన పుష్ప సినిమా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ వందల కోట్ల రూపాయల వసూళ్ళు సాధించిన విషయం తెలిసిందే.