కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పెద్దగా మెరుపులు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అత్యంత సాదాసీదా బడ్జెట్ మాదిరిగానే ఉంది. ప్రతి ఏటా ఎదురుచూసినట్లుగానే వేతన జీవులకు మరోసారి నిరాశే. ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు. అయితే ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు సంబంధించి అదనపు వెసులుబాట్లు కల్పించారు.
ఆదాయ పన్ను చెల్లింపు సవరణలకు రెండేళ్ళ సమయం ఇచ్చారు. దీని ప్రకారం రిటర్న్ లు సమర్పించిన తర్వాత ఏమైనా పొరపాట్లు...తప్పులు ఉంటే రెండేళ్ళ పాటు మార్చుకునే వెసులుబాటు దక్కింది. అయితే సహకార సంస్థల పన్ను 15 శాతం తగ్గించారు. అదే సమయంలో సహకార సంస్థలు చెల్లించే సర్ ఛార్జీలు 7 శాతానికి కుదించారు. నేషనల్ పెన్షన్ స్కీంలో డిడక్షన్ 14 శాతం పెంచుకునే వెసులుబాటు ఇచ్చారు.