ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు మృతి

Update: 2020-10-18 15:53 GMT

మహారాష్ట్రలో ఎన్ కౌంటర్. అందులో ఐదుగురు మావోయిస్టులు మృతి. గడ్చిరోలి జిల్లాలోని కోస్మి-కిస్నేలి అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.

అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమచారంతో సీ60 కమాండో ఫొర్సెస్ కూంబింగ్ చేపట్టాయి. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని గడ్చిరోలి ఎస్పీ తెలిపారు. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించారు.

Tags:    

Similar News