బీమా రంగంలో ఎఫ్ డిఐ పరిమతి 74 శాతం పెంపు

Update: 2021-02-01 07:39 GMT

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష్య పెట్టుబడులు (ఎఫ్ డిఐ) పరిమితిని 74 శాతానికి పెంచారు. ప్రస్తుతం ఇది 49 శాతంగా ఉంది. దీంతో దేశంలోకి మరిన్ని విదేశీ సంస్థలు బీమా రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అయితే కేంద్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మార్పులు చేస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాటి తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయించింది. 2021-22 బడ్జెట్ నేపథ్యంలో ఎయిరిండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది.

పవన్‌ హన్స్‌, ఎయిరిండియా ప్రైవేటీకరణను కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఐడీబీఐ, భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ పెట్టుబడులలో ఉపసంహరణతో పాటు ‌ఈ ఏడాదిలోనే ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇందుకు అవసరమైన చట్టసవరణలు చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఎల్ఐసి ప్రైవేటీకరణపై వివాదం నడుస్తోంది..

Tags:    

Similar News