ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్. తాజాగా ఆయన ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య ఏకంగా పది కోట్ల (100 మిలియన్)కు చేరింది. దీంతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఫాలోయర్లు ఉన్న వారిలో ఆరవ వ్యక్తిగా నిలిచారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ఎలన్ మస్క్ డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ మంగళవారం నాటితో ఆయన వయస్సు 51 సంవత్సరాలకు చేరింది.
అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకు ఏకంగా 132.1 మిలియన్ల మంది పాలోయర్లు ఉంటే...జస్టిన్ బైబర్ కు 114.1 మిలియన్లు, కేటీ పెర్రీకి 108.8 మిలియన్లు, రిహనాకు 106.9 మిలియన్లు, క్రిస్టినో రొనాల్డో కు 101.3 మిలియన్ల మంది ట్విట్టర్ ఫాలోయర్లు ఉన్నారు. వీరి తర్వాత ఇప్పుడు జాబితాలో ఎలన్ మస్క్ చేరారు.