వాతావరణ మార్పులు..భూకంపాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే రష్యా తీరంలో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు దక్షిణ అమెరికా ను భారీ భూకంపం వణికించింది. డ్రీక్ పాసేజ్ లో ఇది చోటు చేసుకుంది. దీంతో సునామి హెచ్చరికలు జారీ చేశారు. ఈ డ్రీక్ పాసేజ్ దక్షిణ అమెరికా, అంటార్కిటికా మధ్య ఉన్న జలవనరు. ఇక్కడ రిక్టర్ స్కేల్ పై ఈ భూకంప తీవ్రత 7 .5 శాతంగా నమోదు అయింది. భూ ఉపరితలానికి పదకొండు కిలోమీటర్ల లోతున ఈ భూకంపాన్ని గురితించినట్లు అధికారులు చెపుతున్నారు. తాజా భూకంపంతో చిలీ సునామి ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది అనే అంచనాలు వెలువడుతున్నాయి.
దీంతో ఆ దేశం అప్రమత్తం అయింది. ఇక్కడ సునామి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం బయటకు రాలేదు. దీనికి ప్రధాన కారణం ఈ ప్రాంతం ఒక మారుమూలన ఉండటం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు అని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రష్యా తీరంలో వచ్చిన భూఖంపం తీవ్రత కూడా 8 .8 గా నమోదు అయింది. ఈ ప్రభావంతో రష్యా, జపాన్ తో పాటు ఉత్తర పసిఫిక్ ప్రాంతంలో సునామి ప్రభావానికి లోనయ్యాయి. అయితే తాజా డ్రీక్ పాసేజ్ భూకంపం వల్ల సునామి ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అనే అంచనాలు వెలువడుతున్నాయి.