టర్కీ, గ్రీస్ లో భారీ భూ కంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై ఇది 7గా నమోదు అయింది. ఈ భూ కంపం ధాటికి పలు బహుళ అంతస్థుల భవనాలు కుప్పకూలాయి. ప్రజలు అందరూ భయాందోళనలతో బయటకు వచ్చారు. ఈ భూ కంపంతో చిన్నపాటి సునామీలాగా వచ్చింది. శిథిలాల కింద వేల మంది మృతులు ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం పదుల సంఖ్యలో మృతులు ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ భూకంపం ప్రబావం బల్గేరియా, సైప్రస్, ఈజిప్ట్, గ్రీస్, లిబియా, యునైటెడ్ కింగ్ డమ్ లపై పడింది.