డొనాల్డ్ ట్రంప్..అభిశంసన రికార్డు

Update: 2021-01-14 05:39 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగిపోయే ముందు పెద్ద ఎత్తున అపప్రథ మూటకట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆయన రెండవ సారి అభిశంసనకు గురైన అమెరికా అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. గతంలో ఎవరూ కూడా ట్రంప్ లా ఇంతటి దారుణ పరిస్థితి ఎధుర్కొలేదు. అయినా కూడా ఆయన ఏ మాత్రం వెరవకుండా అడ్డగోలు నిర్ణయాలతో చివరకు సొంత పార్టీ వాళ్ళు కూడా అవాక్కయ్యేలా చేస్తున్నారు. క్యాపిటల్‌ హిల్‌ ముట్టడిని ప్రోత్సహించారంటూ అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు.

ఈనెల 20న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రతినిధుల సభలో ట్రంప్ అభిశంసన తీర్మానంపై అనుకూలంగా 232 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 197 ఓట్లు వచ్చాయి. దీంతో అభిశంసన తీర్మానం నెగ్గింది. చివరకు ట్రంప్ పార్టీకి చెందిన పది మంది సభ్యులు అభిశంసన తీర్మానానికి మద్దతు పలికారు. ఈ తీర్మానంపై సెనేట్ ఓటింగ్ నిర్వహించనుంది. సెనేట్ లో కూడా ఆమోదం పొందితే ట్రంప్ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అయితే సెనేట్ సమావేశం జనవరి 19కి వాయిదా పడింది. జో బైడెన్ బాధ్యతలు చేపట్టాక ట్రంప్ పై విచారణ జరగనుంది.

Tags:    

Similar News