సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా కీలక ప్రకటన చేశారు. . ఒక్కో వ్యాక్సిన్ డోసు ప్రభుత్వానికి అయితే 200 రూపాయలకు..ప్రైవేట్ వ్యక్తులకు అయితే డోస్ 1000 రూపాయల లెక్కన విక్రయిస్తామని ప్రకటించారు. 100 మిలియన్ల డోస్ లను ప్రభుత్వానికి 200 రూపాయల ప్రత్యేక దరపై అందిస్తామన్నారు. ప్రస్తుతం తాము భారత ప్రభుత్వానికే వ్యాక్సిన్ అందిస్తామని..మిగతా విషయాలు తర్వాత ఆలోచిస్తామన్నారు.
అదే సమయంలో వ్యాక్సిన్ ఎగుమతికి సంబంధించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ ఎగుమతులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉండదన్నారు సీరమ్ ఇన్ స్టిట్యూట్ భారత్ లో ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను మూడవ దశ ప్రయోగాలతోపాటు ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్లో వ్యాక్సిన్ అమ్మకంపై నిషేధం ఉందన్నారు. ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.