దేశ వ్యాప్తంగా సోమవారం నాడు ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ముంబై లోని ఒక వినాయకుడికి సంబదించిన వార్త ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే ఈ విగ్రహాన్ని 69 కేజీల బంగారం, 336 కేజీల వెండితో అలంకరించారు. ఈ విగ్రహం జీఎస్ బి సేవా మండల్ లో ప్రతిష్టించారు. ముంబై నగరంలోని అత్యంత సంపన్న నిర్వాహకులు ఉండే ప్రాంతం అది. ఈ విగ్రహానికి భారీ ఎత్తున బంగారం, వెండి అమర్చటంతో దీనికి ఏకంగా 360 కోట్ల రూపాయల మేర భీమా చేయించారు. ఇప్పుడు ఈ విగ్రహం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. మరో చోట పూర్తి నగదుతో వినాయకుడి విగ్రహం తయారు చేశారు. వినాయక చవితి సందర్భంగా వెరైటీ వెరైటీ విగ్రహాలతో కొంత మంది అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ముంబైలో బంగారం, వెండి తో సిద్ధం చేసిన విగ్రహమే దేశంలో అత్యంత ఖరీదు అయిన వినాయకుడి విగ్రహంగా చెపుతున్నారు.