కరోనా వైరస్ లో నెలకు రెండు మ్యుటేషన్లు

Update: 2020-12-26 11:39 GMT

ఆందోళనన అక్కర్లేదు..రణదీప్ గులేరియా

న్యూఢిల్లీకి చెందిన ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా బ్రిటన్ లో కొత్తగా వెలుగుచూసిన స్టెయిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కరోనా వైరస్ లో సగటున నెలకు రెండు మ్యుటేషన్లు ఉంటాయని..అందువల్ల దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. మ్యుటేషన్ల వల్ల లక్షణాల్లో, చికిత్స విధానంలో కూడా ఎలాంటి మార్పులు ఉండవన్నారు.

అయితే ట్రయల్ దశలో ఉన్న వ్యాక్సిన్లు మ్యుటేషన్ వైరస్ కు కూడా సమర్ధవంతమైన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే కొత్త స్టెయిన్ కు వేగంగా విస్తరించే లక్షణాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఎక్కువ మంది సూచిస్తున్నారు. ఇదిలా ప్రధాని నరేంద్రమోడీకి కోవిడ్ 19పై సలహాదారు గా ఉన్న వి కె పౌల్ కూడా దేశంలో ఇఫ్పటివరకూ బ్రిటన్ కు చెందిన వైరస్ గుర్తించలేదని తెలిపారు.

Tags:    

Similar News