టీఆర్పీ స్కామ్...బార్క్ సంచలన నిర్ణయం

Update: 2020-10-15 09:26 GMT

టీవీ రేటింగ్స్ లో మాయాజాలం. ఎప్పటి నుంచో దీనిపై విమర్శలు. రేటింగ్స్ లో గోల్ మాల్ చేస్తూ పలు ఛానళ్లు తమ రీచ్ ఎక్కువ అని చెప్పుకుంటూ ఆ మేరకు ప్రకటనలు పొందటం ద్వారా పెద్ద ఎత్తున ఆర్ధిక ప్రయోజనం పొందుతున్నాయి. తాజాగా ముంబయ్ కేంద్రంగా వెలుగుచూసిన వ్యవహారం దేశ వ్యాప్తంగా టీఆర్పీ రేటింగ్స్ అంశంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ స్కామ్ లో స్థానిక మరాఠా ఛానల్స్ తోపాటు ప్రస్తుతం నెంబర్ వన్ గా ఉన్న రిపబ్లిక్ టీవీతోపాటు ఇండియా టుడే ఛానల్స్ పేరు కూడా వెలుగులోకి వచ్చాయి. దీనిపై ప్రస్తుతం ముంబయ్ పోలీసుల విచారణ కొనసాగుతోంది.

ఈ తరుణంలో బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రిసెర్చ్ కౌన్సిల్ (బార్క్) కీలక నిర్ణయం తీసుకుంది. 8 నుంచి 12 వారాల పాటు ప్రతి వారంలో ఇచ్చే న్యూస్ ఛానళ్ల రేటింగ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. బార్క్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా పటిష్టంగా నిర్ణయం తీసుకునేందుకు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బార్క్ ఇండియా సీఈవో సునీల్ లుల్లా తెలిపారు. టీవీల వీక్షణ రేటింగ్స్ లో మోసాలను అరికట్టేందుకు కొత్తగా విధివిధానాలను ఖరారు చేయనున్నారు.

Tags:    

Similar News