జగన్ లేఖపై అటార్నీ జనరల్ కీలక వ్యాఖ్యలు

Update: 2020-11-02 11:13 GMT

సీజెఐకి లేఖ సమయం అనుమానాస్పదం

ఆరోపణలు చేసిన వారి ఉద్దేశం కలుషితం

కోర్టు ధిక్కార చర్యలపై అనుమతికి మాత్రం నో

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 6న భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై ఆయన న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ రాసిన లేఖపై స్పందించారు. సీజెఐకి జగన్ రాసిన లేఖ కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని.. ఏపీ సీఎం జగన్ పై 1971 కోర్టు ధిక్కార చట్టంలోని సె క్షన్ 15 ప్రకారం క్రిమినల్ కంటెప్ట్ చర్యలకు అనుమతించాలని కోరుతూ అటార్నీ జనరల్ కు అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన అటార్నీ జనరల్ పలు అంశాలను ప్రస్తావించారు. అశ్వనీకుమార్ పిటీషన్ లోని అంశాలను తాను పరిశీలించానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 6న రాసిన లేఖలో అభ్యంతరకర ప్రకటనలు ఉన్నాయన్నారు. ఈ లెటర్ ను సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం అక్టోబర్ 10న విలేకరుల సమావేశం పెట్టి విడుదల చేశారని, ఈ లెటర్ లోని అంశాలు, ఆరోపణలు తన దృష్టికి వచ్చాయన్నారు.

ఈ లెటర్ రాసిన సమయం, విలేకరుల సమావేశం పెట్టి ఈ లేఖను విడుదల చేసిన తీరు ఖచ్చితంగా అనుమానించాల్సిన విధంగానే ఉందన్నారు. ప్రజా ప్రతినిధుల పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని జస్టిస్ రమణ ఆదేశాలు జారీ చేసిన తరుణంలో ఇది జరిగిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. సీఎం జగన్ పై 31 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని అశ్వినికుమార్ ఉపాధ్యాయ ప్రస్తావించిన అంశాన్ని తన లేఖలో పేర్కొన్నారు. ప్రాథమికంగా చూస్తే పైన పేర్కొన్న వ్యక్తుల ఉద్దేశం కలుషితమైనది కావచ్చొని..అయితే సీఎం జగన్ రాసిన లేఖకు సంబంధించి, అజయ్ కల్లాం మీడియా సమావేశం నిర్వహణకు సంబంధించి తలెత్తే కోర్టు ధిక్కార వ్యవహారం..ఇతర అంశాలు ప్రస్తుతం సీజెఐ పరిధిలో ఉన్నాయన్నారు. ఈ తరుణంలో తాను ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవటం సరికాదన్నారు. ఈ కారణాలతో తాను కోర్టు ధిక్కార చర్యలకు అనుమతించలేనని తెలిపారు.

Tags:    

Similar News