ఏపీ సర్కారు ఫిక్స్ చేసిన జరిమానాలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాకమానదు. సర్కారు ఖజానా నింపుకునేందుకు జరిమానాల మార్గాన్ని ఎంచుకున్నట్లు కన్పిస్తోంది. అయితే ఈ జరిమానాలు అమలు చేస్తే వాహనదారుల స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. ప్రస్తుతం రాజధానిగా ఉన్న విజయవాడ ప్రాంతంలో వాహనదారుల క్రమశిక్షణ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.
మరి ఈ జరిమానాల ప్లాన్ వర్కవుట్ అవుతుందా?.లేక మధ్యలోనే సర్కారు నిర్ణయం మార్చుకుంటుందో వేచిచూడాల్సిందే. కానీ సర్కారు నిర్ణయించిన జరిమానాలు చూస్తే మాత్రం ఎవరికైనా షాక్ తగలాల్సిందే. బుధవారం నాడు ఏపీ సర్కారు మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘన పై జరిమానాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జరిమానాల వివరాలు ఇలా ఉన్నాయి.
వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే - రూ. 750
సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా - రూ. 750
అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే - రూ. 5000
అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే - రూ. 5000
డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే - రూ. 10000
రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే - రూ. 5000
వేగంగా బండి నడిపితే - రూ. 1000
సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ - రూ. 10000
రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000
రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా - మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000
పర్మిట్ లేని వాహనాలు వాడితే - రూ. 10000
ఓవర్ లోడ్ - రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం
వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా - రూ. 40000
ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే - రూ. 10000
అనవసరంగా హారన్ మోగించినా - మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా
రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినినవారికి - రూ. లక్ష